
జనం న్యూస్ వనపర్తి డివిజన్ రిపోర్టర్ శివకుమార్ జనవరి 17 పెబ్బేరు శనివారం
ధూప దీప నైవేద్య పథకం తో పాటు అర్చకుల పై పలువురు చేస్తున్న దుష్ప్రచారం మానుకోవాలని వనపర్తి జిల్లా అధ్యక్షులు పీవీ లక్ష్మీకాంతచార్యులు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆరుట్ల మాధవమూర్తి ఒక ప్రకటన లో అన్నారు కొందరు అర్చకులు పెద్దమనుషులుగా ప్రచారం చేసుకుంటూ వారి ఉద్యోగ ధర్మాన్ని విస్మరిస్తూ దేవాదాయ కార్యాలయం పై పెత్తనం చేస్తున్నారని అన్నారు నిరంతరం వారి పబ్బం గడుపుకోవడం కొరకు ధూప దీప నైవేద్య పథకం పై దుష్ప్రచారం చేయడం జరుగుతున్నదని ప్రభుత్వం వారి ఆరోపణలు నిగ్గుతెల్చాలని సోషల్ అడిట్ కు ఆదేశించడాన్ని ధూప దీప నైవేద్య సంఘం స్వాగతిస్తున్నదని అన్నారు అర్చక సంఘం పై అధ్యక్ష కార్యవర్గం పై అసత్య ఆరోపణలు చేసే వారిపై సంఘం అంతే దురుసుగా ప్రవర్తిస్తుందని హెచ్చరించారు ధూప దీప నైవేద్య అర్చక సంఘం తెలంగాణ ప్రజలు పాలకులు బాగుండాలని ప్రభుత్వం ద్వారా అర్చక సంక్షేమం జరిగి అర్చక కుటుంబాలు బాగుండాలనే ఉద్దేశంతో కీ శే గంగు భానుమూర్తి ఆలోచనతో సంఘం ఆవిర్భవించిందని తెలంగాణ ప్రజల క్షేమం కొరకు ధూప దీప నైవేద్య అర్చకుల సహకారంతో ప్రతి సంవత్సరం సంఘం ద్వారా యజ్ఞ యాగాది క్రతువులు నిర్వహిస్తామని లోకాః సమస్తా సుఖినో భవంతు అన్న వేదసూక్తిని ఆధారంగా చేసుకొని సంఘం ముందుకు వెళ్తుందని పేర్కొన్నారు
కరోనా సమయం లో కూడా తెలంగాణ ప్రజాక్షేమం కోరి ప్రభుత్వానికి అండగా సీఎం సహాయా నిధికి హితోధికంగా సహాయం చేసిన పెద్ద మనస్సు ధూప దీప నైవేద్య అర్చకులదని గ్రామీణ ప్రాంతాలలో దేవాలయ వ్యవస్త ను కాపాడటం కొరకు నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని రూపొందించిందని నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కార్ డిడిఎన్ అర్చకులకు ఉద్యోగ భద్రత వేతన పెంపుదల చేస్తుందనే విశ్వాసం అర్చకులకు ఉన్నదని అన్నారు అర్చకులు ప్రభుత్వానికి అనుకూలంగా సమాజంలో మంచిని పెంపొందించేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు తెలంగాణ ప్రభుత్వం సమాజం డిడియన్ అర్చకులకు సహకారంగా ఉండి గ్రామీణ ప్రాంతాల్లో అర్చక వ్యవస్థను కాపాడాలని విజ్ఞప్తి చేశారు గ్రామాల్లోని ప్రాచీన ఆలయాల ద్వారా సనాతన హిందూ ధర్మాన్ని కాపాడుతున్న ధూప దీప నైవేద్య సంఘం అర్చకులపై ఆరోపణలు ఇకనైనా మానుకోవాలని హితవు పలికారు