
సిద్దిపేట: 17 జనవరి శనివారం జనం న్యూస్ ; సిద్దిపేట నియోజిక వర్గ ఇన్చార్జి వై.రమేష్
;డా.బి.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, సిద్దిపేట అధ్యయన కేంద్రంలో పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం నిర్వహించేందుకు నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు. ఎన్నో సంవత్సరాల తర్వాత పూర్వ విద్యార్థులు ఒకే వేదికపై కలుసుకునే విధంగా ఈ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించనున్నారు.ఈ కార్యక్రమానికి పూర్వ విద్యార్థుల జ్ఞాపకాలను గుర్తు చేసేలా ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించారు. ఈ సమ్మేళనం ద్వారా పాత మిత్రులు మళ్లీ కలుసుకొని తమ అనుభవాలను పంచుకునే అవకాశం కలగనుంది.
ప్రాంతీయ సమన్వయకర్త డా. ఎం . శ్రద్ధానందం మాట్లాడుతూ, ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనం విద్యార్థుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుందని తెలిపారు. విద్య, ఉపాధి, సమాజాభివృద్ధి అంశాలపై చర్చలు జరగనున్నాయని చెప్పారు.ఈ కార్యక్రమంలో పలు జిల్లాల నుంచి పూర్వ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నట్లు నిర్వాహకులు తెలిపారు.