
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ వీరేశం జనం న్యూస్ జనవరి 17
ఆధ్వర్యంలో గృహ జ్యోతి పథకం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అధికారులు పాల్గొని గృహ జ్యోతి పథకం కింద అర్హులైన గ్రామ ప్రజలకు సర్టిఫికెట్స్ను అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గృహ జ్యోతి పథకం ద్వారా పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు విద్యుత్ భారం తగ్గుతుందని, ఈ పథకం గ్రామీణ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా మారిందని గ్రామ సర్పంచ్ ప్రేమ్ సింగ్ రాథోడ్ తెలిపారు. గ్రామ అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ చేరేలా కృషి చేస్తున్నామని ఆయన అన్నారు. గ్రామ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ప్రభుత్వ పథకాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సిబ్బంది, గ్రామ కార్యదర్శి, స్థానిక నాయకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గృహ జ్యోతి పథకం అమలుతో గ్రామ ప్రజల్లో ఆనందం వ్యక్తమైంది.
