
జనం న్యూస్ జనవరి 17 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
అనకాపల్లి : మహారాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సాధించిన ఘన విజయాన్ని పురస్కరించుకుని, ఈ రోజు ఉదయం 11:00 గంటలకు అనకాపల్లి జిల్లా పార్టీ కార్యాలయం నుండి నాలుగు రోడ్ల కూడలి వరకు విజయోత్సవ ర్యాలీ ఘనంగా నిర్వహించబడింది.ఈ ర్యాలీలో భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, పదాధికారులు భారీ సంఖ్యలో పాల్గొని, ప్రజాస్వామ్యంలో బీజేపీకి లభించిన విశ్వాసాన్ని జయఘోషలతో వ్యక్తం చేశారు. పార్టీ జెండాలు, నినాదాలతో నిర్వహించిన ఈ విజయోత్సవం అత్యంత ఉత్సాహభరితంగా సాగింది.దేశవ్యాప్తంగా ప్రజల మద్దతుతో ముందుకు సాగుతున్న భారతీయ జనతా పార్టీ విజయయాత్రకు ఈ విజయం మరో మైలురాయిగా నిలిచింది. ఈ కార్యక్రమాన్ని నాయకులు, కార్యకర్తల సమిష్టి కృషితో విజయవంతంగా నిర్వహించారు. అనంతరం అనకాపల్లి జిల్లా అధ్యక్షులు ద్వారపరెడ్డి పరమేశ్వర రావు మాట్లాడుతూ బిజెపిని ఎన్నికలలో గెలిపించిన మహారాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ అదే విధంగా మన రాష్ట్రంలో కూడా ముందు ముందు జరగబోయే ఎన్నికల్లో ప్రజలు మద్దతు తెలిపి కూటమిని గెలిపించాలని పిలుపునిచ్చా రు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి లు బొడ్డేడ నాగేశ్వరరావు,బి రత్న భరత్ , కిసాన్ మోర్చా నాయకులు పాలకపాటి రవిరాజు, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు ఓరుగంటి నాగమణి, భానుమతి,భరత్, మారిశెట్టి భాస్కరరావు, నర్సింగ్ యాదవ్, రామేశ్వరరావు ,తదితర నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.