
జనం న్యూస్ జనవరి 17: నిజామాబాద్ జిల్లా
ఏర్గట్ల మండల కేంద్రంలో సీఎం కప్–2025 క్రీడోత్సవాలకు సంబంధించి టార్చ్ ర్యాలీని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మండల యంత్రాంగం సమన్వయంతో విజయవంతంగా చేపట్టింది.
ఈ టార్చ్ ర్యాలీలో ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, ఫిజికల్ డైరెక్టర్లు, ఎంఈఓ ఆనంద్ రావు,వివిధ పాఠశాలల హెడ్మాస్టర్లు, పంచాయతీ కార్యదర్శులు, క్రీడాకారులు, పోలీసు సిబ్బంది, సర్పంచులు, ఉప సర్పంచులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు ,ప్రజలుపాల్గొన్నారు. మండలవిద్యాధికారి మాట్లాడుతూ మాట్లాడుతూ సీఎం కప్–2025 క్రీడాపోటీలపై యువతలో ఆసక్తి పెంపొందించడంతో పాటు క్రీడాస్ఫూర్తిని పెంచడమే ఈ కార్యక్రమం లక్ష్యమని అన్నారు.