
సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ బి వీరేశం జనం న్యూస్ జనవరి 17 మొగుడంపల్లి మండల్ ధనసిరి గ్రామం నుండి సుమారు 60 మంది యువత పార్టీ సిద్ధాంతాలు, కార్యక్రమాల పట్ల ఆకర్షితులై రాజ్యాధికార పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా పార్టీ జెండా కప్పి వారికి ఘన స్వాగతం పలికారు. సంగారెడ్డి జిల్లా యూత్ అధ్యక్షుడు నర్సింలు మాట్లాడుతూ తీన్మార్ మల్లన్న ప్రజా ఉద్యమ స్ఫూర్తితో యువత ముందుకు రావడం అభినందనీయమని తెలిపారు. యువత శక్తినే పార్టీలో బలంగా మార్చి ప్రజల సమస్యలపై పోరాటం చేయడమే రాజ్యాధికార పార్టీ లక్ష్యమని చెప్పారు. గ్రామీణ యువత రాజకీయాల్లో చురుకుగా పాల్గొనాలని, పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని తీన్మార్ మల్లన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.