
జనం న్యూస్ జనవరి 19 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మండలంలోని అన్ని గ్రామాల్లో ఈ నెల 31వ తేదీ వరకు జరగనున్న ఉచిత పశు ఆరోగ్య శిబిరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని నర్సింగ్ బిల్లీ పశు వైద్యాధికారి డాక్టర్ అల్ఫోన్సా జార్జ్ అన్నారు. మండలంలోని సోమవారం గ్రామంలో పశు ఆరోగ్య శిబిరాన్ని పాల సంఘం అధ్యక్షులు గూడుపు సూర్యప్రకాష్ గారు ప్రారంభించారు. ఈ పశు ఆరోగ్య శిబిరంలో 21 పశువులకు గర్భకోస వ్యాధుల చికిత్స, 40 పెద్ద పశువులకు 32 లేగదూడలు కు నట్టల నివారణ మందులు పంపిణీ చేసినట్లు 52 పశుపోషకులు పాల్గొన్నట్లు పశువైద్యాధికారి తెలిపారు. రేపు మండలంలోని విస్సన్నపేట మరియు ఉగ్గిన పాలెం గ్రామాలలో జరిగే పశు ఆరోగ్య శిబిరాలు పశుపోషకులు సద్వినియోగం చేసుకోవాలని పశు వైద్యాధికారి కోరారు.