
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బీ వీరేశం జనం న్యూస్ జనవరి 19
ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టిఆర్ఎస్ పార్టీ నాయకులు ముఖ్య అతిథులుగా హాజరై క్యాలెండర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో వై నరోత్తం, శివకుమార్, దేవిశ్రీప్రసాద్, మొగుడంపల్లి షికారి గోపాల్ తదితర ప్రముఖ నాయకులు పాల్గొని ముత్రాజ్ సంఘం సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముత్రాజ్ సంఘం సామాజిక ఐక్యతకు, అభివృద్ధికి చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు. సంఘం భవిష్యత్తులో మరింత బలోపేతం కావాలని, ప్రతి కార్యక్రమంలో ఐక్యతతో ముందుకు సాగాలని సూచించారు. క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో సంఘం నాయకులు, సభ్యులు, పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
