
జనం న్యూస్ ;19 జనవరి సోమవారంసిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్ :
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం సిద్దిపేట ప్రాంతీయ సమన్వయ కేంద్రం 41 సంవత్సరాలు పూర్తయ్యాయి ఈ సందర్భంగా కేంద్రంలో ఆదివారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు .సుమారు 400 విద్యార్థులు హాజరయ్యారు కళాశాలలో చదివి ఉన్నత స్థాయికి ఎదిగిన వారు ప్రస్తుతం ఉన్నత స్థానంలో ఉన్నవారు తమ అనుభవాలను ఆత్మీయ మిత్రులతో పంచుకున్నారు. మ్యాజిక్ కళాకారుడు వై.రమేష్ తన మ్యాజిక్ ప్రదర్శన ద్వారా అందర్నీ ఆకట్టుకొని ఆలోచింపజేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సార్వత్రిక విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ గంటా చక్రపాణి హాజరయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 10 లక్షల మంది ప్రతిభావంతులను తయారుచేసింది సార్వత్రిక విశ్వవిద్యాలయం అని పేర్కొన్నారు . ఇక్కడ చదివిన వారంతా విశ్వవిద్యాలయం బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు .సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సునీత ప్రాంతీయ సమన్వయకర్త డాక్టర్ శ్రద్ధానందం మాట్లాడారు. సిద్దిపేట కేంద్రం నుంచి 3000 మంది డిగ్రీ పట్టా పొందడం గొప్ప విషయం అన్నారు .ఈ కార్యక్రమంలో సార్వత్రిక విశ్వవిద్యాలయం రిజిస్టర్ ఎల్.వి.కె రెడ్డి అకాడమిక్ డైరెక్టర్ పుష్ప చక్రపాణి, నోడల్ అధికారి బానోతు ధర్మ ప్రతినిధులు వెంకటేశ్వర్లు ,సోలోమన్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ అయోధ్య రెడ్డి ,కళాశాల పూర్వ ప్రిన్సిపాల్ డాక్టర్ పాపయ్య తదితరులు పాల్గొన్నారు.