
జనం న్యూస్ జనవరి 19 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
అనకాపల్లి,జిల్లావ్యాప్తంగా అసాంఘిక కార్యకలాపాలపై పటిష్ట చర్యల్లో భాగంగా వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో నిర్వహించిన దాడుల వివరాలు. అనకాపల్లి పేకాట రాయుళ్ల అరెస్ట్ అనకాపల్లి రూరల్ ఎస్.ఐ. జి.రవికుమార్ తన సిబ్బందితో కలిసి గోపాలపురం గ్రామంలో జూదం (పేకాట) ఆడుతున్న స్థావరంపై మెరుపు దాడి నిర్వహించారు. 7 గురు వ్యక్తులను అరెస్టు చేసి రూ.7,150/- నగదు స్వాధీనం చేసుకున్నారు.పరవాడ: కోడిపందాల స్థావరంపై దాడి పరవాడ ఎస్.ఐ. మహాలక్ష్మి మరియు సిబ్బందితో రావాడ గ్రామ శివారు ప్రాంతంలో జరుగుతున్న కోడిపందాలపై దాడి చేశారు.అరెస్టులు: ఇద్దరు వ్యక్తులు.స్వాధీనం: రూ.1,150/- నగదు మరియు 2 పందెం కోళ్లు.రాంబిల్లి: పందెం కోళ్లతో సహా ఇద్దరు అదుపులోకి రాంబిల్లి ఎస్.ఐ. నాగేంద్ర మరియు వారి సిబ్బంది కే.జీ.పాలెం గ్రామంలో నిర్వహించిన కోడిపందాల స్థావరంపై దాడి చేశారు.
అరెస్టులు: ఇద్దరు వ్యక్తులు. స్వాధీనం: రూ.1,150/- నగదు మరియు 2 పందెం కోళ్లు. జిల్లాలో జూదం, కోడిపందాలు వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. గ్రామాల్లో ఎక్కడైనా ఇలాంటి పనులు జరుగుతుంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.//