
జనంన్యూస్. 19.శ్రీనివాస్ పటేల్. నిజామాబాదు. సిరికొండ.
నిజాంబాద్ జిల్లా కేంద్రంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డిని అలాగే మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ని మర్యాదపూర్వకంగా కలిసిన రావుట్ల గ్రామస్తులు ఇరువురి నాయకులకు శాలువతో సత్కరించి పుష్పగుచ్చం అందజేశారు వచ్చే పౌర్ణమి కి తమ గ్రామంలో శ్రీ గడి ముకుల రాజరాజేశ్వర స్వామి జాతర. రథోత్సవం సందర్భంగా నాయకులను సాధారణంగా ఆహ్వానించారు.. అలాగే గత కొన్ని రోజులుగా తమ గ్రామంలో అటవీ పరిధిలోని భూములను కాపాడాలని ఇరువురి నాయకుల దగ్గర గ్రామస్తులు తమ గోడు వెల్లబోసుకున్నారు ఇరువురు నాయకులు తక్షణమే చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.అటు తర్వాత నేరుగా కలెక్టర్ ఆఫీస్ కు పోయి కలెక్టర్ కు మెమోరండం అందజేశారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు విడిసి చైర్మన్ నత్తి భూమయ్య. గ్రామ పెద్ద మనుషులు మరియు గ్రామ సర్పంచ్ రాజుకుమార్ ఉప సర్పంచ్ శ్రీనివాస్.వార్డ్ మెంబర్ లు గ్రామ యువత పాల్గొన్నారు.

