
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జి బివీరేశం జనం న్యూస్ జహీరాబాద్, జనవరి 19:
జహీరాబాద్ హరేకృష్ణ మూమెంట్ బృందం మౌని అమావాస్యను పురస్కరించుకొని క్షేత్ర సంకీర్తన కార్యక్రమం నిర్వహించారు. మాఘ మాసంలో వచ్చే మౌని అమావాస్య సందర్భంగా న్యాలకల్ మండలం రాఘవాపూర్ పంచవటి క్షేత్రంలో మంజీరా నది జలాలతో స్నానం చేసి సరస్వతి మాత దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో అభిషేకం చేసి వన భోజన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం అదే మండలంలోని అమీరాబాద్ గ్రామంలో పురాతన శ్రీ కృష్ణ మందిరంలో సంకీర్తన కార్యక్రమం జరిపారు. రెండున్నర గంటలపాటు ఏకధాటిగా సాగిన ఈ సంకీర్తన లో అమీరాబాద్ గ్రామస్థులు సైతం ఉత్సాహంగా పాల్గొన్నారు. హరేకృష్ణ మూమెంట్ బృందం ద్వారా ఏర్పాటు చేసిన ఈ క్షేత్ర సంకీర్తన కార్యక్రమంలో లక్ష్మి వెంకటేష్ జాదవ్, ఉమా జాదవ్, వాణిశ్రీ, ఆకాంక్ష, రామ్ రతన్ సార్డా, వందన సార్డా, అజయ్ సార్డా, ఎన్నం రఘు, బాచా వెంకటేశం, అజయ్ కుమార్ న్యాల్కల్కర్, నర్సింహా రెడ్డి, ప్రవీణ్,మోహన్ రెడ్డి, సంగీత రెడ్డి, భువన రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, శ్రీదేవి రెడ్డి, చంద్రకాంత్ రెడ్డి, మహేందర్ గోడకే, సవిత గోడకే, భరత్ ఓజా, సంకీర్తన గ్రూప్ కు సంబంధించిన మహిళా భక్తులు, గ్రామానికి చెందిన గ్రామ పెద్దలు ఈ కార్యక్రమం లో పాల్గొని సంకీర్తన సభ్యులందరిని దీవించారు. గ్రామంలో కృష్ణ మందిరం అతి పురాతనమైనదని ఈ మందిరంలోని వేణుగోపాల స్వామిని దర్శించుకోవడం ద్వారా జన్మ ధన్యం అవుతుందని గ్రామస్తులు పేర్కొన్నారు. నగర సంకీర్తన బృందం ప్రతి నెలలో ఒకరోజు క్షేత్ర సంకీర్తన నిర్వహించడం ముదావహమని
కొనియాడారు. గ్రామస్థులు సైతం ఉత్సాహంగా సంకీర్తన కార్యక్రమం లో పాల్గొని నృత్యాలు చేశారు.
