
జనం న్యూస్ ;19 జనవరి సోమవారం:సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై. రమేష్ ;
సిద్దిపేట పట్టణంలోని బ్రహ్మా కుమారీస్ సెంటర్లో సంస్థ వ్యవస్థాపకులు ప్రజాపిత బ్రహ్మ బాబా 57వ పుణ్యతిథిని విశ్వశాంతి దినంగా ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సంస్థ నిర్వాహకురాలు బి.కే. భవాని మాట్లాడుతూ, నిరాకార శివ పరమాత్మ బోధించిన సత్యమార్గాన్ని అనుసరిస్తూ ప్రజాపిత బ్రహ్మ బాబా సుఖం, శాంతి, ఆనందం, ప్రేమలను అనేకుల జీవితాలలో నింపారని తెలిపారు. తనువు, మనసు, ధనం, సమయాన్ని విశ్వసేవకే అంకితం చేసి ఆదర్శప్రాయమైన జీవితం గడిపారని పేర్కొన్నారు. బ్రహ్మ బాబా జీవిత చరిత్రను ఆదర్శంగా తీసుకొని అనేక మంది ఈశ్వరీయ సేవలో తమ జీవితాలను అర్పించుకున్నారని వివరించారు.
అనంతరం సంస్థ సభ్యులందరూ కలిసి ప్రజాపిత బ్రహ్మ బాబా గారి చిత్రపటానికి పుష్పాలతో శ్రద్ధాంజలి అర్పించారు.57వ పుణ్యతిథిని పురస్కరించుకొని పట్టణంలోని నిరాశ్రయుల వృద్ధ ఆశ్రమం లార్డ్ స్వచ్ఛంద సంస్థలోని వృద్ధులకు ఈశ్వరీయ సందేశాన్ని తెలియజేసి, బిస్కెట్ ప్యాకెట్లు, పండ్లను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధి బి.కే. స్వప్న, సంస్థ సభ్యులు వై. ఓంకారం, జగదీష్ శర్మ, రాజశేఖర్, కోటేశ్వర్, శాంత, బిందు, భవాని, అర్చన, ఆద్య తదితరులు పాల్గొన్నారు.