
బిచ్కుంద ఎస్సై రాజు
బిచ్కుంద జనవరి 19 జనం న్యూస్
ప్రతి ఒక్కరూ రహదారిపై ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ద్విచక్ర వాహనాదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఎస్సై రాజు సూచించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రోడ్డు భద్రతపై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలని కారులో ప్రయాణించే వారు తప్పక సీటు బెల్టు ధరించాలని మద్యం సేవించి వాహనాలు నడపరాదని వాహనాలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు వెంట ఉంచుకోవాలని నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.అనంతరం రోడ్డు భద్రత ట్రాఫిక్ నియమ నిబంధనలు అనే అంశంపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలను నిర్వహించారు గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు.ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది కళాశాల అధ్యాపకులు,విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

