
జనం న్యూస్. తర్లుపాడు మండలం. జనవరి 20
ఈరోజు తర్లుపాడు మండల పరిధిలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 360 మంది 10వ తరగతి విద్యార్థులకు ఉచితంగా స్టేడి మెటీరియల్ అందించడం జరిగింది. ప్రతి ఒక్కరికి మంచి మార్కులు రావాలని ఉద్దేశంతో ఒక్కొక్క పుస్తకం 70 రూపాయలు విలువ గల మొత్తం 360 పుస్తకాలు దాతల సహకారం తీసుకొని ఉచితంగా జగన్ పంచడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మొదటగా తర్లపాడు జడ్పీ హైస్కూల్లో ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎస్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కె ఎర్రయ్య అలాగే దాతలు లైన్స్ క్లబ్ అధ్యక్షులు టీవీ రామకృష్ణారావు లైన్స్ క్లబ్ కోశాధికారి బివి రంగయ్య అలాగే వాసవి క్లబ్ మాజీ గవర్నర్ గంగిశెట్టి కిరణ్ కుమార్, నెక్స్ట్ యు తర్లపాడు మండల ప్రధాన కార్యదర్శి షేక్ నజీర్ అహ్మద్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు ఎం సుధాకర్ మరియు టీచింగ్ స్టాఫ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దాతలైనటువంటి జగన్, రామకృష్ణారావు రంగయ్య, కిరణ్ కుమార్ లను ప్రధానోపాధ్యాయులు శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ప్రభుత్వ స్కూల్లో దాదాపుగా ఆర్థికంగా వెనుకబడిన పిల్లలు ఉంటారని భావించి అందరికీ ఉచితంగా ఇవ్వాలని ఉద్దేశంతో వారి మిత్రుల ఆర్థిక సహకారం ద్వారా ఈ పుస్తకాలను అందించాలని తెలియజేశారు. ఈ మెటీరియల్ నుంచి పోయిన సంవత్సరం 80% మార్కులు వచ్చాయని తెలియజేశారు. ఈసారి వంద మార్కులకు వచ్చే విధంగా పుస్తకాన్ని రూపొందించడం జరిగిందని తెలియజేశారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క విద్యార్థి సద్వినియోగపరుచుకొని మంచి మార్కులతో స్కూలుకు మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరినారు. ఈ సందర్భంగా లైన్స్ క్లబ్ అధ్యక్షులు రామకృష్ణారావు మాట్లాడుతూ అసెట్టి జగన్ ప్రతినిత్యం సమాజానికి ఏదో ఒకటి చేయాలని తపనతో మాలాంటి అందరిని సమన్వయపరచుకొని సేవా కార్యక్రమాలు చేస్తుండడం చాలా గర్వించదగ్గ విషయమని తెలియజేశారు. రిటైర్డ్ ప్రిన్సిపాల్ రంగయ్య మాట్లాడుతూ జగన్ చేసే సేవ కార్యక్రమాలు మా అందరికీ ఆదర్శనీయంగా ఉంటాయి . అంతేకాకుండా ప్రతి ఒక్కరికి మేలు చేసే విధంగా అతను ఆలోచనలు ఉంటాయని ఈ సందర్భంగా అభినందించడం జరిగింది. ఈ పుస్తకాలను ఉచితంగా పంచడానికి సహకరించిన దాతలు డోనార్స్ లిస్ట్ ఎస్ టి యు తర్లుపాడు శాఖ కమల జూనియర్ కాలేజీ పవన్ ఎన్ఎస్ అగ్రికల్చర్ అండ్ లా కాలేజీ నాదేళ్ల చంద్రమౌళి గంగిశెట్టి కిరణ్ కుమార్ గుంపల్లి రత్నంశెట్టి టీవీ రామకృష్ణా రావు, లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ డీర్. కె స్వాతి, బెంగళూరు
బి వి రంగయ్య లయన్స్ క్లబ్ జవ్వాజి. విజయలక్ష్మి, రాజముండ్రి ముక్కర. అశోక్, జగన్నాధపురం యక్కలి. బాలు, మార్కాపురం
