
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 20 జనవరి
బిడ్డా నువ్వు ఎన్ని నోటీసులు పంపినా, ఎన్ని విచారణలకు పిలిచినా నిన్ను విడిచి పెట్టేది లేదు రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు అటెన్షన్ డైవర్షన్ కోసం చిల్లర రాజకీయాలు చేస్తున్నావు.మాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. మేం తప్పు చేయలేదు.రాత్రి 9 గంటలకు నోటీసు ఇచ్చినా నేను సిద్దిపేట నుంచి వచ్చి హాజరవుతున్నా.దైర్యంగా వెళ్తున్నాం అడిగిన వాటికి బాజాప్తా సమాధానం చెబుతాం ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆల్రెడీ సుప్రీం కోర్టు చెంపచెల్లు మనేలా సమాధానం చెప్పింది.నువ్వు ఎన్ని జిమ్మిక్కులు చేసినా నిన్ను వదిలి పెట్టం. నీ కుంభకోణాలు బయట పెడుతూనే ఉంటం.కేసీఆర్ గారి నాయకత్వంలో రాటు దేలిన కార్యకర్తలం. ఉద్యమకారులం ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కేసులు పెట్టినా వదిలి పెట్టం. ప్రజల కోసం, రాష్ట్రం కోసం మా పోరాటం జరుపుతూనే ఉంటాం.ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేసే దాకా వెంటపడుతూనే ఉంటం.మున్సిపల్ ఎన్నికల వేళ డ్రామాలు. రెండేళ్లలో నువ్వు ఈ కేసులో చేసింది ఏముంది. ఇంకా ఎన్ని రోజులు ఈ సీరియల్ నడుపుతావు ఇప్పటికే కాళేశ్వరం పేరుతో శ్వేతపత్రాలు అన్నవు, విచారణ అన్నవు, కమిషన్ అన్నవు. చిల్లర రాజకీయాలు బంద్ పెట్టు. ప్రజలకు కావాల్సింది రైతు బందు, పింఛన్, ఉద్యోగాలు, ఫీజు రీయింబర్స్ మెంట్, తులం బంగారం. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయి, నామీద కేసులు పెడితే, అటెన్షన్ డైవర్ట్ చేస్తే తప్పించుకోలేవు.ఇంకా గట్టిగా నిలదీస్తం. మున్సిపల్ ఎన్నికల ఎజెండా నీ ఆరు గ్యారెంటీలు, నీ 420 హామీలు, రెండు లక్షల ఉద్యోగాలు మున్సిపల్ ఎన్నికల్లో నైతికంగా దెబ్బ తీసే ప్రయత్నాలు సక్సెస్ కావు. నీ కేసులకు బిఆర్ఎస్ బయపడదు.వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో నీకు ప్రజలకు దిమ్మదిరిగే విధంగా జవాబు చెబుతారు చూస్కో రేవంత్ రెడ్డి అని అన్నారు .