
జనంన్యూస్. 21.సిరికొండ. శ్రీనివాస్ పటేల్.
నిజామాబాదు రురల్ సిరికొండ మండల కేంద్రం లొని తాసిల్దార్ కార్యాలయంలో ఈరోజు మీ సేవ నిర్వాహకులతో తాసిల్దార్ రవీందర్రావు, డిప్యూటీ తాసిల్దార్ గంగాధర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మార్వో మాట్లాడుతూ, ఎవరైతే అప్లికేషన్ చేసుకోవడానికి వస్తారో వారి నుండి పూర్తి స్థాయి, సరైన సమాచారం సేకరించి మాత్రమే మీ సేవ కేంద్రాల్లో పొందుపరచాలని సూచించారు.అప్లికేషన్లో తప్పులు, అసంపూర్ణ వివరాలు ఉంటే ప్రజలు అనవసరంగా ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తుందని, దానికి నిర్వాహకులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.అలాగే, సర్టిఫికెట్లు, ఆదాయ ధృవీకరణ పత్రాలు, కుల ధృవీకరణ పత్రాలు తదితర సేవలకు సంబంధించి ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలను కచ్చితంగా పాటించాలని తెలిపారు. ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించడమే మీ సేవల లక్ష్యమని, ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని స్పష్టం చేశారు.ఈ సమావేశంలో మీ సేవ నిర్వాహకులు పాల్గొని తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.