
జనంన్యూస్. 21. న్యూ ఢిల్లీ.. సిరికొండ. శ్రీనివాస్. పటేల్.
ఢిల్లీ లోని లోకనాయక్ భవన్ లో జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు *హుస్సేన్ నాయక్ సమక్షంలో నిజామాబాద్ జిల్లా, సిరికొండ మండలం పాకాల గ్రామం కు సంబంధించిన సమస్యలపై విచారణ జరిగింది.
పాకాల గ్రామంలో గత అనేక సంవత్సరాలుగా కొనసాగుతున్న తాగునీటి సదుపాయం, రహదారుల సదుపాయం, పాఠశాల సదుపాయం వంటి మౌలిక వసతుల లేమిపై నాలుగు నెలల క్రితం జాతీయ ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేయడం జరిగింది.ఈ ఫిర్యాదుపై స్పందించిన కమిషన్, నిన్న నిర్వహించిన విచారణకు పాకాల గ్రామ ప్రతినిధులు, అలాగే జిల్లా కలెక్టర్ గారికి నోటీసులు జారీ చేసింది. ఈ సందర్భంగా జిల్లా తరఫున జిల్లా జెడ్పీ డిప్యూటీ సీఈఓ సాయన్న హాజరయ్యారు.విచారణ సందర్భంగా హుస్సేన్ నాయక్ మాట్లాడుతూ,
మూడు నెలల లోపల పాకాల గ్రామంలో ఎలాంటి సమస్యలు లేకుండా పూర్తి అభివృద్ధి చేయాలని,
నిజామాబాద్ జిల్లా కలెక్టర్ స్వయంగా పాకాల గ్రామాన్ని సందర్శించి పరిస్థితులను పరిశీలించాలని ఆదేశించారు.అదేవిధంగా, రాబోయే నెలల్లో తానే స్వయంగా పాకాల గ్రామాన్ని సందర్శిస్తానని హుస్సేన్ నాయక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాకాల గ్రామానికి సంబంధించి బాణావత్ గంగాధర్. మాలవత్ రాజేందర్.బాణావత్ రమేష్ పాల్గొన్నారు.