
జనం న్యూస్. తర్లుపాడు మండలం. జనవరి 21
తర్లుపాడు: మార్కాపురం రైల్వే స్టేషన్‌ను సందర్శించిన దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ జిఎం శ్రీవాత్సవను తర్లుపాడు మండల కేంద్రానికి చెందిన పలువురు ప్రముఖులు మరియు ప్రజలు కలిసి వినతిపత్రం అందజేశారు. కరోనాకు ముందు తర్లుపాడు స్టేషన్లో ఆగిన పలు రైళ్లను ప్రస్తుతం నిలపకపోవడంతో తాము పడుతున్న ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. కరోనాకు ముందు తర్లుపాడులో ఆగే 17226, 17225, 17228, 17261, 17262 నెంబర్లు గల రైళ్లను తిరిగి ఇక్కడ ఆపాలని కోరారు.గుంటూరు, నంద్యాల ప్రాంతాలకువెళ్లేప్రయాణికులకు తర్లుపాడు కీలకమైన స్టేషన్. ఉదయం పూట రైలు మిస్ అయితే, మళ్లీ 20 గంటల వరకు వేరే రైలు లేకపోవడంతో ప్రజలు తీవ్రఇబ్బందులుపడుతున్నారని వివరించారు.తిరుపతి వెళ్లే రైళ్లను కూడా తర్లుపాడులో ఆగేలా చర్యలు తీసుకోవాలనివిన్నవించారు.తర్లుపాడు మండల కేంద్రంతో పాటు చుట్టుపక్కల ఉన్న దాదాపు 20 గ్రామాల ప్రజలు గుంటూరు, ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు ఈ స్టేషన్‌పైనే ఆధారపడతారని వారు జీఎంకు తెలియజేసారు ఈ కార్యక్రమంలో మానవహక్కుల కమిషన్ ఉపాధ్యక్షులు షేక్ మహబూబ్ వలి,వెలుగు కాశీరావు, షేక్ అఫ్రోజ్, షేక్ బాషా, వెన్నా రాజా రాం రెడ్డి, షేక్ ఖాసీంవలి, షేక్ శిలార్శ, రొడ్డ వెలుగొండయ్య,పఠాన్ కరీముల్లా,వెలుగు రమేష్, కొండెబోయిన వర్ధన్, గంజరపల్లి మహేష్, కొండెబోయిన సునీల్,గుంటూ మోషే, గాలి నెమలి రెడ్డి వెలుగు క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు.