
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జి బి వీరేశం జనం న్యూస్ జనవరి 21
సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎంపీడీవో స్వయంగా మండలంలోని సర్పంచ్‌లను శాలువాలు కప్పి పుష్పగుచ్ఛాలు అందజేసి ఘనంగా సత్కరించారు. అనంతరం తిరిగి సర్పంచ్‌గా ఎన్నికైన శ్రీమతి జగదాంబ సోమప్పకు ప్రత్యేకంగా ఘన సన్మానం నిర్వహించగా సభ మొత్తం హర్షాతిరేకాలతో మార్మోగింది. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా ప్రజలకు ఉపయోగపడే పనులు సమన్వయంతో చేయాలని, అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ కలిసి పనిచేస్తేనే సంక్షేమ పథకాలు సక్రమంగా అమలవుతాయని అన్నారు. గ్రామస్థాయిలో సమస్యలను గుర్తించి పరిష్కరించడంలో సర్పంచ్ల పాత్ర కీలకమని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పారదర్శకంగా పని చేయాలని సూచించారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, సర్పంచ్‌లు పాల్గొని ఈ సన్మాన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
