
జనం న్యూస్ 22 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ మాట్లాడుతూ – సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్ట్ వంటి కొత్త నేరాలకు పాల్పడుతున్న సైబర్ మోసగాళ్ళకు తోడు ఇప్పుడు కొందరు నయా మోసగాళ్ళు కొత్త పంధాతో నేరాలకు పాల్పడుతున్నారన్నారు. మీకు తెలిసినవారు లేక మీ ప్రాంతం వారు ముఖ్యంగా మహిళలు, చిన్న పిల్లలు ఆపదలో ఉన్నారని, వేరే ప్రాంతంలో చిక్కుకున్నారని, ప్రయాణంలో వారి బ్యాగులు, సామానులు పోయాయని, వారు సొంత ప్రాంతానికి రావడానికి ఇబ్బందులు పడుతున్నారని, తినడానికి కూడా డబ్బులు లేవని, తాను విలేకరినని చెప్పుకుంటూ కొంత మందికి ఫోనులు చేసి ఆపదలో ఉన్నవారికి సాయం చేయాలని డబ్బులు వసూలు చేస్తూ మోసం చేస్తున్నారని జిల్లా ఎస్పీ తెలిపారు. కొంతమంది ఫోన్ పే, గూగుల్ పే స్కానర్ పంపి కూడా సాయం పేరుతో డబ్బులు దోచుకుంటున్నారన్నారు. ఈ తరహా మోసాలు ఇటీవల మన రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో వెలుగు చుసాయని, కావున ప్రజలు ఈ తరహా మోసాల పట్ల అప్ప్రమత్తంగా ఉండాలని, ఎవరికైనా ఇటువంటి ఫోన్ కాల్స్ వస్తే ముందుగా నిర్ధారించుకోవాలని, అవసమైతే స్థానిక పోలీసులను ఆశ్రయించాలని జిల్లా ఎస్పీ ప్రజలకు సూచించారు.