
జనం న్యూస్ 22 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
సాక్షి మీడియా ప్రతినిధి అల్లు యుగంధర్ బుధవారం ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనంపై వెళ్తూ యాక్సిడెంట్‌కు గురయ్యారు.ఈ ప్రమాదంలో ఆయన కాలికి తీవ్రమైన ఫ్రాక్చర్ అయ్యింది. ఈ విషయం తెలుసుకున్న వెంటనే విజయనగరం జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్ మరియు భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) స్పందించారు. ఘటనా స్థలంలో ఉన్న యుగంధర్‌ను తన పర్యవేక్షణలో తక్షణమే చికిత్స నిమిత్తం స్థానిక గాయత్రి ఆసుపత్రికి తరలించారు.
అనంతరం ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి, యుగంధర్‌కు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.