
జనం న్యూస్ జనవరి 22 చిలిపి చెడు మండల ప్రతినిధి
మెదక్ జిల్లా చిలిపిచేడ్ మండలంలోని సోమక్కపేట్ గ్రామ నూతన పాలకమండలిసభ్యులనుమండల విద్యాధికారి ఘనంగా సన్మానించారు. ఇటీవల బాధ్యతలు చేపట్టిన నూతన పాలకమండలి సభ్యులు విద్యారంగ అభివృద్ధికి తమ పూర్తి సహకారం అందిస్తామని ఈ సందర్భంగా తెలిపారు.మండలంలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, విద్యార్థుల నాణ్యమైన విద్య, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా మండల విద్యాధికారి మాట్లాడుతూ, విద్యారంగ అభివృద్ధికి పాలకమండలి సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు. విద్యార్థులకు మెరుగైన భవిష్యత్తు అందించేందుకు ఉపాధ్యాయులు, అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి పి.విటల్ గ్రామసర్పంచ్ దుర్గాచలం,ఉప సర్పంచ్ ,వార్డ్ మెంబర్లు కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు కాంప్లెక్స్ రమేష్ ,ప్రధానోపాధ్యాయులు సొమకృష్ణ , నాగరాజు, పాఠశాల ఉపాధ్యాయులు అజయ్ కుమార్ ,యాద గౌడ్ ,మోహన్ ,మహేష్ కుమార్ ,విజయ ,విష్ణువర్ధన్ ,రమాదేవి ,సంగీత ,ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.