
జనం న్యూస్ 22 జనవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
గ్రామంలో గొడవలు,ఘర్షణలు, మతకలహాలు సృష్టించేందుకు గ్రామ అధికారి జయలక్ష్మి గ్రామంలో గ్రామసభలు జరగకుండానే, గ్రామసభలో ఆమోదం, తీర్మానం లేకుండా అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఇది గ్రామంలో గొడవలకు,ఘర్షణలకు,మతకలహాలకు దారి తీసే పరిస్థితులు ఉన్నాయి.పాలకులకు,ప్రతిపక్షాలకు, మండల స్థాయి లీడర్లకు సపోర్ట్ చేస్తూ.. ప్రభుత్వ అనుమతులను,గ్రామ అనుమతులను ధిక్కరిస్తూ.. చట్టానికి విరుద్ధంగా పని చేస్తున్న అధికారిని పై, మండల స్థాయి అధికారుల పై జిల్లా ఉన్నత అధికారులు వీరిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. ఇది ఎక్కడో కాదు పచ్చర్ల గ్రామం రాజోలి మండలం జోగులాంబ గద్వాల జిల్లా లో జరుగుతున్న బాగోతం.త్వరలో.. ఫ్లాష్ న్యూస్ లో పక్కా ఆధారాలతో జిల్లా ఉన్నత అధికారుల దృష్టికి తీసుకొస్తాము.