
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీలో గ్రామ సర్పంచ్, గ్రామ శాఖ అధ్యక్షుడు, కాంగ్రెస్ నాయకులు
జనం న్యూస్ 22 జనవరి 2026 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్)
ఎల్కతుర్తి మండలం జీలుగుల గ్రామంలో గ్రామ సర్పంచ్ ఘనబోయిన సృజన రాజు యాదవ్ అధ్యక్షతన గురువారం గ్రామానికి చెందిన తంగేళ్ల సారయ్య కు అత్యవసర చికిత్స కోసం సీఎం సహాయనిది మంజూరైన 39వేల రూపాయల చెక్కును లబ్ధిదారునికి విలువైన చెక్కును గ్రామ శాఖ అధ్యక్షుడు తౌటం నరేందర్ ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ గ్రామ శాఖ అధ్యక్షుడు కాంగ్రెస్ నాయకుల చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ,పేదలు, నిరుపేదల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ప్రజల కష్టాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు.అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా కృషి చేస్తున్నామని మండలంలోని అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఘనబోయిన సృజన రాజు యాదవ్, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు తౌటం నరేందర్,మాజీ సర్పంచులు గూటం జోగిరెడ్డి,రావుల రమేష్, మాజీ ఉపసర్పంచ్ ముచ్చ బుచ్చిరెడ్డి, కాంగ్రెస్ నాయకులు రావుల లక్ష్మణ్, రావుల వీరయ్య,కుక్కల ఓదెలు, ఆరేపల్లి ప్రభాకర్, ఘనబోయిన తిరుపతి, స్థానిక ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.