
జనంన్యూస్. 22.నిజామాబాదు.శ్రీనివాస్ పటేల్.
నిజామాబాదులో అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా ఆటో డ్రైవర్లకు, ఆర్టీసీ డ్రైవర్లకు , లారీ డ్రైవర్లకు , అంబులెన్స్ డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం నిర్వాహణ పి. సాయి చైతన్య, ఐపీఎస్., ఆదేశాల మేరకు ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ నేతృత్వంలో పోలీస్ కమిషనర్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ హాల్ యందు రహదారి రక్షకుడు అనే శిక్షణ కార్యక్రమం సేవ్ లైఫ్ ఫౌండేషన్ ( ఢిల్లీ ) వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమాన్ని ఉద్దేశించి ట్రాఫిక్ ఏసిపి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు రక్షణ గురించి ప్రతి ఒక్కరు అన్ని రకాల జాగ్రత్తలు పాటించాలని అలా పాటించినప్పుడే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చునని తెలియజేసారు. ప్రతి చిన్న ప్రమాదము ఒక అనుభవము కావాలని , ఏ ప్రమాదము జరిగినా దాని తక్కువ అంచనా వేయవద్దని సూచించారు. ప్రమాద సంఘటన జరిగిన అనంతరము బాధితులను అంబులెన్స్‌లలో తరలించే క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను నిబంధనలు తెలిపారు. సుప్రీం కోర్టు గైడ్‌లైన్స్ ప్రకారము 2016 చట్టం ప్రకారము రహదారి భద్రత నిబంధనలు తూ.చా తప్పకుండా పాటించాలని , ప్రభుత్వం నుంచి అందించే ప్రోత్సాహాలు మరియు పారితోషకం గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని, దీనితోపాటు శతకాత్రులకు ప్రభుత్వం నుండి వచ్చే ఉచిత వైద్యం కోసము తెలియజేశారు. సి పి ఆర్ ఏ విధంగా ఉపయోగించాలో క్షుణ్ణంగా అవగాహన కల్పించడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో జే. ఉమామహేశ్వరరావు, జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారి , ట్రాఫిక్ సిఐ పి. ప్రసాద్ , ట్రాఫిక్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఎమ్. వినోద్ , ఎస్సై పి సంజీవరావు , సేవ్ లైఫ్ ఫౌండేషన్ అధికారులు ఏంజెల్ భాటియా , శివమ్ సింగ్ , వర్షా ( ఈ డార్ ) ఆటో డ్రైవర్లు ( ప్యాసింజర్స్ మరియు గూడ్స్ ) , ఆర్టీసీ డ్రైవర్లు , లారీ డ్రైవర్లు , అంబులెన్స్ డ్రైవర్లు , ఐటి కోర్స్ సిబ్బంది తదితరులు పాల్గొనడం జరిగింది.
