
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 22 జనవరి
జహీరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో బీసీల ప్రాధాన్యత ఇవ్వాల్సిందే అలాకాకుండా బీసీలకు అన్యాయం జరిగితే ఊరూకునేది లేదు, మరియు ప్రధానంగా వార్డ్ ప్రకారం చూస్తే కష్టపడే కార్యకర్తలకు మాత్రమే టికెట్ కేటాయించాలి ,అలాకాకుండా బయటి నుంచి వచ్చే వారికి టికెట్ కేటాయిస్తే గల్లి అభివృద్ధి కోసం ఎప్పటినుండో కష్టపడుతున్న కార్యకర్తలకు పక్కనపెట్టి బయటి వారికి బీఫాంలు ఇస్తే బీసీ జేఏసీ తిరగబడతది అని హెచ్చరించారు.గొల్ల కురుమ , ముదిరాజు, పద్మశాలి, బీసీ మైనార్టీ, రజకులు, వడ్డెర ,సగర నాయి బ్రాహ్మ ,నిజమైన బీసీలకు మున్సిపల్ చైర్మన్ పదవి కేటాయించాలి .జేఏసీకి మద్దతుగా ఎస్సీ, ఎస్టీ, దళిత సంఘాల నాయకులు బడుగు బలహీన వర్గాలు మద్దతు తెలిపారు.ఈ కార్యక్రమంలో కిషన్ రాథోడ్, బాలకృష్ణ ,,, మొహమ్మద్ ఇమ్రాన్,, ,శివ మాదినామ్, తదితరులు పాల్గొన్నారు.