
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా.
తెలుగు కళావేదిక అధ్యక్షులు సాహితీవేత్త డాక్టర్ కోడూరు సుమన శ్రీ,
ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక సృజనాత్మక సమితి వారి సౌజన్యంతో తెలుగు కళావేదిక సాంస్కృతిక సేవా సంస్థ ఈనెల 24 ,25వ తేదీలలో కడప నగరంలోని శాస్త్రి సమావేశ మందిరం లో గండికోట సాంస్కృతిక మహోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు తెలుగు కళావేదిక అధ్యక్షులు నాట్యాచార్య సాహితీవేత్త డాక్టర్ కోడూరు సుమశ్రీ తెలియజేశారు ఈ కార్యక్రమంలో 24వ తేదీ సంగీతం శాస్త్రీయ జానపద నృత్యాలు కవి సమ్మేళనం 25వ తేదీన గౌరవ సత్కార పురస్కారాలు అందజేయ నున్నట్లు ఆమె తెలిపారు కడప జిల్లా వ్యాప్తంగా కవులు కళాకారులు విచ్చేసి కార్య క్రమాన్నివిజయవంతం చేయవలసిందిగా ఆమె పత్రికా ముఖంగావిజ్ఞప్తి చేశారు,