
జనం న్యూస్ 23 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
రాష్ట్ర రాజకీయాల్లో బిజీగా ఉంటున్న వైసీపీ నేత బొత్స.. తన కుమార్తె అనూష, కుమారుడు సందీప్ చీపురుపల్లి నియోజకవర్గంలో యాక్టివ్ చేశారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ముఖ్యంగా 4 మండలాల్లో అనూష విస్తృతంగా పర్యటిస్తూ కార్యకర్తల్లో నూతన ఉత్సాహం నింపుతున్నారు. బొత్సతో పాటుగా ఆమె కూడా పార్టీ కార్యక్రమాల్లో హుషారుగా పాల్గొంటున్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆమెను పోటీకి దించుతారనే చర్చ నడుస్తోంది.