
జనం న్యూస్ జనవరి 23 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
కేపీహెచ్బీ కాలనీ రోడ్ నెంబర్ ఒకటి లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహ ఆవిష్కారణ మహోత్సవ కార్యక్రమమునకు ఛత్రపతి ధర్మ రక్షణ సేన వ్యవస్థాపక అధ్యక్షులు కర్ర వేణు గోపాల్ ఆహ్వానం మేరకు కూకట్పల్లి నియోజకవర్గ జనసేన పార్టీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ పాల్గోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళు అర్పించారు.ఈ సందర్భంగా ప్రేమ కుమార్ మాట్లాడుతూ,నేతాజీ సుభాష్ చంద్రబోస్ దేశభక్తి, స్వాతంత్ర్య పోరాటంలో ఆయన చేసిన త్యాగం, నాయకత్వం భారతదేశానికి ఎప్పటికీ స్ఫూర్తిదాయకం అని అన్నారు.ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర సెక్రటరీ జై శ్రీ, మూసాపేట కార్పొరేటర్ మహేంధర్, జనసేన పార్టీ నాయకులు కొల్లా శంకర్, వేముల మహేష్ , పోలేబోయిన శ్రీనివాస్, గోపి, అనిత గాలి తదితరులు పాల్గొన్నారు.
