
జనం న్యూస్. తర్లుపాడు మండలం. జనవరి 23
విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసే పదో తరగతి పరీక్షల్లో వారు రాణించాలని ఆకాంక్షిస్తూ జనసేన నాయకులు ఉదారత చాటుకున్నారు. తర్లుపాడు మండలం తాడివారిపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం 10వ తరగతి విద్యార్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్ మరియు ఎగ్జామ్ ప్యాడ్లను పంపిణీ చేశారు.తాడివారిపల్లి జనసేన నాయకులు రొడ్డ వెలుగొండయ్య, సాయి లు తమ సొంత ఖర్చులతో సుమారు 25 మంది విద్యార్థులకు అవసరమైన పరీక్షాసామాగ్రినిసమకూర్చారు.ఈ కార్యక్రమానికి జనసేన మండల నాయకులు వెలుగు కాశీరావు ముఖ్య అతిథిగా విచ్చేసి, విద్యార్థులకు తమ చేతులమీదుగామెటీరియల్ను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూవిద్యార్థులు క్రమశిక్షణతో చదివి పాఠశాలకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలి.పదో తరగతి అనేది విద్యార్థి జీవితంలో కీలక దశ అని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.పేద విద్యార్థులకు అండగా ఉండాలనే లక్ష్యంతోనే ఈ వితరణ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.రొడ్డ వెలుగొండయ్య, సాయి.లను పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు స్థానిక జనసేన కార్యకర్తలు.దాతల చొరవనుపాఠశాలసిబ్బందిఅభినందించారు.ఈ కార్యక్రమం లో ప్రధానోపాధ్యాయులు విఠల్,పంచాయితీ కార్యదర్శి అనూష,జనసేన మండల అధ్యక్షులు సిహెచ్ శ్రీనివాసులు, రొడ్డ శ్రీనివాసులు, కొండెబోయిన సునీల్, గంజరపల్లి మహేష్, గుంటూ మోషే పాల్గొన్నారు