జనం న్యూస్ ఫిబ్రవరి 7 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి : శుక్రవారం కెపి హెచ్ బి డివిజన్ ఎమ్మార్వో కార్యాలయం నందు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తో పాటు కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు 290 మంది లబ్ధిదారులకు.. కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆనాడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిరుపేద ఆడబిడ్డ పెళ్లయితే వారికి అండగా ఉండాలన్న సదుద్దేశంతో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రారంభించారని గుర్తు చేశారు.. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పండాల సతీష్ గౌడ్, ఆవుల రవీందర్ రెడ్డి, ముద్దం నరసింహ యాదవ్, జూపల్లి సత్యనారాయణ, సబియా గౌసుద్దీన్, పగుడాల శిరీష బాబురావు.. నాయకులు పాల్గొన్నారు..