
ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి సర్పంచ్ లక్ష్మణ్ పటేల్…
జుక్కల్ జనవరి 23 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం డోంగ్లి మండలం మదన్ హిప్పర్ గా గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ బచ్చవర్ లక్ష్మణ్ పటేల్ ముఖ్య అతిథిగా హాజరై, గ్రామస్తులతో కలిసి పాల్గొన్నారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్.ఆర్. శ్రీవాస్తవ్ విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు గ్రామ ప్రజలతో ఓటర్ల ప్రతిజ్ఞ చేయించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు విలువను వివరిస్తూ, ప్రతి పౌరుడు తన ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు చందు, సారిక, సవిత పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అలాగే గ్రామ పెద్దలు, విద్యార్థులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ప్రజల్లో ఓటు హక్కుపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని ప్రధానోపాధ్యాయులు శ్రీవాస్తవ్ తెలిపారు.

