
బిచ్కుంద జనవరి 23 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటానమస్ బిచ్కుంద లో నేడు రాజనీతి శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో జాతీయ ఓటర్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మార్వో వేణుగోపాల్ గారు, విద్యార్థులకు ఓటు హక్కు ప్రాధాన్యతను ఓటు హక్కు పొందే విధానాన్ని వివరించారు. కళాశాల ప్రిన్సిపల్ శ్రీ కె.అశోక్ గారు విద్యార్థుల ను ఉద్దేశించి మాట్లాడుతూ ఓటు అనే ఆయుధం తో మనం మన పాలకులను ఎన్నుకోవచ్చని ఓటుహక్కు గొప్పతనం వివరించారు. రాజనీతి శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ టి .అశోక్ రావు గారు మాట్లాడుతూ దేశంలో యువత క్రియా శీలక పాత్ర పోషించినపుడే ప్రజాస్వామ్యం పరిరక్షించ బడుతుందని విద్యార్థులకు సూచించారు. అనంతరం విద్యార్థులచే ఓటు హక్కు ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ జి వెంకటేశo, అకాడమిక్ కోఆర్డినేటర్ డా.టి.హన్మండ్లు, రెవెన్యూ అధికారులు డిప్యూటీ తహసిల్దార్ భరత్ , ఆర్. ఐ రవి కళాశాల అధ్యాపకులు మరియు విద్యార్థిని,విద్యార్థులు పాల్గొన్నారు .

