
కాంట్రాక్టర్ల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు
ప్రజా క్షేమాన్ని గాలికి వదిలేసిన వైనం
పర్సంటేజ్ మత్తులో ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు
నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి కాంట్రాక్టర్ల లైసెన్సును రద్దు చేయాలి
జనం న్యూస్ ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం రిపోర్టర్ ఠాగూర్ జనవరి 23 :
మేడేపల్లి గ్రామ సమీపంలో నిర్మిస్తున్నటువంటి బ్రిడ్జి నిర్మాణంలో నిర్లక్ష్యంగా కాంట్రాక్టర్ పనితీరు సైడ్ వాల్ కు పక్కన పెద్దపెద్ద గోతులు ఉండడంవల్ల కాలనీ నాచారం గ్రామానికి చెందిన వ్యక్తి బొల్లి. కృష్ణయ్య పిల్లర్ గోతి లో పడి ప్రాణాపాయ స్థితి నుండి ఇప్పుడిప్పుడే కోలు కుంటున్నారు కాంట్రాక్టర్ నిర్లక్ష్య ధోరణి కారణంగా పనులు సకాలంలో పూర్తి కాకపోవడం భద్రత ప్రమాణాలను విస్మరించడం మరియు ప్రజలకు ఇబ్బందులు కలగడం వంటి సమస్యలు తరచూ తలెత్తుతున్నాయి రోడ్డు నిర్మాణాలు బ్రిడ్జి నిర్మాణాలు పనులలో కాంట్రాక్టర్లు అధికారులు పర్యవేక్షణ లోపంతో కాలయాపన చేస్తూ ప్రాజెక్టులను అస్తవ్యస్తంగా వదిలేస్తున్నారు భద్రత లోపాలు పాటించకపోవడం నిర్మాణ స్థలాల్లో మట్టి కుప్పలు గుంతలను అలాగే వదిలేయడం హెచ్చరిక బోర్డులు పెట్టకపోవడం కార్మికుల భద్రతను విస్మరించడం దుమ్ము ధూళితో ప్రజలు ఇబ్బంది పడటం ఈ నిర్లక్ష్యం వల్ల నిధులు వృధా అవ్వడమే కాకుండా ప్రజల ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉంది అధికారుల మౌనం కాంట్రాక్టర్ల తీరుపై అధికారులు పట్టించుకోకపోవడం కన్నెత్తి చూడకపోవడం అనుమానాలకు దారితీస్తుంది ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు ఇటువంటి నిర్లక్ష్యపు కాంట్రాక్టర్లపై చట్టపరమైన చర్యలు తీసుకుని ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని కోరుకుంటున్నారు.