
జనం న్యూస్- జనవరి 23- నాగార్జునసాగర్ టౌన్ -
నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ నూతన కమిషనర్ గా ఎ అశోక్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు, గతంలో ఇక్కడ పనిచేసిన కమిషనర్ చింతా వేణు సాధారణ బదిలీలలో భాగంగా అచ్చంపేట మున్సిపాలిటీ ట్రాన్స్ఫర్ కాగా , నేరేడుచర్ల మున్సిపల్ కమిషనర్ గా పనిచేసిన ఎ అశోక్ రెడ్డి నందికొండ మున్సిపాలిటీకి బదిలీపై వచ్చారు. కొత్తగా వచ్చిన మున్సిపల్ కమిషనర్ కు మున్సిపల్ సిబ్బంది సాధర స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ సిబ్బంది పాల్గొన్నారు.