జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 7 రిపోర్టర్ సలికినిడి నాగరాజు ; తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం రాష్ట్ర స్థాయి సర్వసభ్య సమావేశంలో భాగంగా తృతీయ వార్షికోత్సవం విజయవాడలోని ఠాగూర్ గ్రంథాలయంలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర స్థాయి నూతన కమిటి ఎన్నిక జరిగింది. దానిలో భాగంగా పల్నాడు జిల్లా చిలకలూరిపేట తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం అధ్యక్షులు గా పని చేస్తున్న బి. శ్రీను నాయక్ ను రాష్ట్ర సహాయ కార్యదర్శిగా తీసుకోవటం జరిగింది.ఈ మేరకు రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు మేడవరపు రంగా నాయకులు, గౌరవ అధ్యక్షులు బల గంగాధర తిలక్,ప్రధాన కార్యదర్శి, బోడపటి సుబ్బారావు నియమితులైన ఇతర నాయకులు,పాత్రికేయులు ప్రత్యేకంగా అభినందించారు ఈ కార్యక్రమంలో చిలకలూరిపేట తెలుగు జర్నలిస్టుల కమిటీ సభ్యులు పాల్గొన్నారు