
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా. 23-01-26
నందలూరు మండలంలోని నాగిరెడ్డిపల్లె మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోగల అరవపల్లి ఆర్ అండ్ బి బంగ్లా దగ్గర శుక్రవారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ,మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు, ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు బాణ సంచా పేల్చి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో మండల టిడిపి నాయకులు నాగిరెడ్డిపల్లె మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ జంబు సూర్యనారాయణ, సయ్యద్ అమీర్, ఉప్పు శెట్టి సుధీర్, తాటి సుబ్బ రాయుడు, కానకుర్తి వెంకటయ్య, చామంచి పెంచలయ్య, మట్టి బాబు, కుర్రామణి యాదవ్, పాటూరు రమేష్, గండికోట కృష్ణ కుమార్, తుమ్మాది శివ, శివ నరసింహులు, తదితరులు పాల్గొన్నారు.