
విద్యార్థులకు ఓటర్ ప్రతిజ్ఞ చేయించిన తహసిల్దార్..
జుక్కల్ జనవరి 23 జనం న్యూస్
జాతీయ ఓటర్ల దినోత్సవం జనవరి 25 సందర్భంగా శుక్రవారం మద్నూర్ మండల కేంద్రంలో నీ జెడ్ పి హెచ్ ఎస్ బాయ్స్ హైస్కూల్ ప్రాంగణంలో ఓటర్ ప్రతిజ్ఞను మద్నూర్ మండల తహసీల్దార్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా ఓటుకు ఉన్న విలువను వివరించారు.జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఆదివారం ఉదయం 11 గంటలకు మద్నూర్ మండల కేంద్రంలో ర్యాలీ ఉంటుందని, ఇట్టి కార్యక్రమానికి జడ్పీ సీఈవో చందర్ హాజరు అవుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల గిర్దావర్ ఎం శంకర్, స్కూల్ ప్రధానోపాధ్యాయులు , ఉపాధ్యాయులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

