
జనం న్యూస్ డిసెంబర్(23) సూర్యాపేట జిల్లా
తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి పూరపాలక సంఘం కార్యాలయ నూతన కమిషనర్ గా ఎం రామచంద్రరావు శుక్రవారం నాడు పదవి బాధ్యతలు స్వీకరించినాడు. రామచంద్ర రావు ఖమ్మం జిల్లాలో కల్లూరు పురపాలక సంఘ కమిషనర్ గా నిధులు కొనసాగిస్తూ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు తిరుమలగిరి పురపాలక సంఘ కమిషనర్గా బదిలీపై రావడం జరిగింది. అనంతరం కార్యాలయ అధికారులు మరియు సిబ్బంది కమిషనర్ కు సాలువులతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన కమిషనర్ రామచందర్రావు మాట్లాడుతూ మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అందరికి సహాయ సహకారాలతో తాను పురపాలక సంఘ అభివృద్ధికి పాటుపడుతనని స్పష్టం చేశారు.అనంతరం కార్యాలయ సిబ్బందితో కలిసి ఇటీవల ఇక్కడ పనిచేసినా అన్వర్ అలీ బదిలీపై వెళ్తున్న సందర్భంగా వారినీ శాలువులతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది వార్డు ఆఫీసర్లు బిల్ కలెక్టర్లు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.