
స్థానిక అమలాపురం హైస్కూల్ సెంటర్ లో గల సంబర సెలబ్రేషన్స్ హాల్లో ఈరోజు ఉదయం స్వస్థైర్యా మల్టీమిలియన్ ఉమెన్ వెల్నెస్ కార్యక్రమాల ప్రారంభోత్సవ కార్యక్రమం సమాజ హితులు సేవకులు అయిన ఐదుగురు మహిళలతో జరిగింది.ప్రతి ఆలోచన, ప్రతి ప్రయత్నం, ప్రతి నైపుణ్యం అద్భుత సృష్టికి ఒక అవకాశమే అంటూ మహిళల మానసిక, శారీరక ఆరోగ్యం పై, ఆర్థిక సాక్షరత ఆదాయ అవకాశాలపై, స్వయం ఉపాధి మరియు సంపద సృష్టి మార్గాలతో కూడిన పంచ (5) కార్యక్రమాలను - సమాజ హితులైనటువంటి పంచ (ఐదుగురు) మహిళలచే వసంత పంచమి అయిన ఈరోజున ప్రారంభించామని "శివ స్వరూప్ సిగ్నేచర్ గ్రూప్" సీఈఓ డా. సాంబశివరావు పేర్కొన్నారు.ఈ కార్యక్రమాల ప్రారంభోత్సవం స్కారపూరితమైనటువంటి జ్యోతి ప్రజ్వలనతో, దేవతలకు పుష్పార్చనతో ప్రారంభించడం శుభకరమే కాదు ఆదర్శనీయము అని సంస్కార భారతి సాయి లక్ష్మి గారు పేర్కొంటూ మహిళలకు ఉచితంగా ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ప్లేస్మెంట్ కూడా ఇచ్చే కార్యక్రమం అయిన "వుయ్ ట్రైన్ వుయ్ రిటైన్" అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు.మాకిరెడ్డి పూర్ణిమ గారు మాట్లాడుతూ మహిళ తనని తాను ఎలా ఒక శక్తిగా మలుచుకోవాలో నిరూపించే కార్యక్రమమే " బి ఎ బ్రాండ్ " అని తెలుపుతూ " స్వస్థైర్య - బి ఎ బ్రాండ్" కార్యక్రమాన్ని ప్రారంభించారు.ప్రస్తుత రోజుల్లో మహిళ తన కాళ్లపై తన నిలబడడం మరియు సంపాదించడం అత్యావస్యకమని ఈ హ్యాపీ సర్కిల్ ద్వారా ఆ అవకాశం అందరూ ఉపయోగించుకోవాలని యండూరి సీత గారు తెలుపుతూ "హ్యాపీ సర్కిల్ " కార్యక్రమాన్ని ప్రారంభించారు.అనారోగ్యం వచ్చిన తర్వాత హాస్పటల్ కి పరిగెట్టడం కంటే, ఆరోగ్యం పై శ్రద్ధ వహించి మానసిక, శారీరక ఆరోగ్యం పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించే "వెల్నెస్ అవేర్నెస్" కార్యక్రమాల్ని ప్రారంభిస్తూ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ మానస గారు తెలియజేశారు.సమాజ సేవకు ఎన్నో అవకాశాలు ఉన్నాయని వాటిలో కార్యక్రమాలను బట్టి వాలంటీర్ గా సేవ చేయడం చాలా సింపుల్ అని వివరిస్తూ "వాలంటీరింగ్ " కార్యక్రమాన్ని చిక్కం సుధ గారు ప్రారంభించారు.ప్రతి మహిళ తనకున్న ఆలోచనలను నైపుణ్యాలను ఉపయోగించుకునే విధంగా రూపొందించిన ఈ కార్యక్రమాలను సద్వినియోగపరచుకోవాలని స్వస్థైర్య మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ శాంతి స్వరూప్ కోరారు. ఈ ఉచిత కార్యక్రమాల్లో పాల్గొనడానికి 6305790456 నెంబర్ను సంప్రదించాలని తెలియజేశారు.ప్రారంభోత్సవం అనంతరం ప్రారంభికులను సాంబశివరావు శాంతిస్వరూప్ సన్మానించారు.సంస్కార భారతి అధ్యక్షులు కళాపూర్ణ రావు గారు, చిక్కం సూర్య మోహన్ తదితరులు ఈ కార్యక్రమాల్లో పాల్గొనే మహిళలకు సంపూర్ణ సహకారం అందిస్తామని అన్నారు.
కోఆర్డినేటర్లుగా మౌనిక, ప్రసన్న దేవి, సౌజన్య, యువశ్రీ తదితరులు పాల్గొన్నారు.
