తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి బావిదొడ్డి నాగేశ్వర్ నియామకం.

- నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టీస్ కమిషన్
- జనం న్యూస్ 7 ఫిబ్రవరి 2025 సంగారెడ్డి జిల్లా ఇన్చార్జి బుక్క షఫీ : సంగారెడ్డి జిల్లా
- నారాయణ్ ఖేడ్ ప్రాంతీయ కార్యాలయం లో నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టీస్ కమిషన్ జాతీయ చైర్మన్ మహతాబ్ రాయ్,ఇండియా ఇన్చార్జి బి సర్వెందర్ వారి ఆదేశానుసారంగా గురువారం రోజున
- నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టీస్ కమిషన్ జిల్లా అధ్యక్షుడు కృష్ణ ,డివిజన్ అధ్యక్షుడు ఎస్ నర్సింలు ఏర్పాటు చేసిన సమావేశం లో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర చైర్మన్ రహీమ్,వైస్ చైర్మన్ వై పండరి లు సమావేశం నిర్వహించి నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టీస్ కమిషన్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలానికి చెందిన బావి దొడ్డి నాగేశ్వర్ ను తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా నియమిస్తున్నట్లు నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టీస్ కమిషన్ తెలంగాణ స్టేట్ చైర్మన్
- అబ్దుల్ రహీం పేర్కొన్నారు. గతంలో అంబేద్కర్ పూలే సేవ సమితి సంఘం లో జిల్లా ప్రధాన కార్యదర్శి పనిచేస్తూ ప్రజా సమస్యల పట్ల ఎప్పటికప్పుడు స్పందించి పరిష్కరించుటకు తన వంతు కృషి చేయడం జరిగిందని అందుకోసం సమాజ సేవకు మరింత కృషి చేసినందుకు మానవ హక్కుల పరిరక్షణ, అవినీతి నిర్మూలన కొరకు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా బావి దొడ్డి నాగేశ్వర్ ను నియమించడం జరిగిందని ఆయన తెలిపారు. తనపై నమ్మకముతో ఎంపిక చేసిన నేషనల్ హ్యూమన్ రైట్స్ రాష్ట్ర చైర్మన్ అబ్దుల్ రహీమ్,వైస్ చైర్మన్ వై పండరీ లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు బావి దొడ్డి నాగేశ్వర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బైండ్ల కృష్ణ, డివిజన్ అధ్యక్షుడు ఎస్ నర్సింలు తదితరులు పాల్గొన్నారు.