
జనం న్యూస్. తర్లుపాడు మండలం. జనవరి 24
మార్కాపురం జిల్లా తర్లుపాడు మండలంలోని చెన్నారెడ్డి పల్లి ఎస్సీ కాలనీలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన అగ్ని ప్రమాదంలో ఓ నిరుపేద కుటుంబం ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో మురారి శ్యామల అనే మహిళకు చెందిన ఇల్లు కాలి బూడిదవగా, సుమారు రూ.2 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లింది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, శుక్రవారం ఇంట్లో ఒక్కసారిగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ సంభవించడంతో మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు ఇల్లంతా వ్యాపించడంతో ఇంట్లో ఉన్న నిత్యావసరాలు, వంట సామాగ్రి, బట్టలు సహా అన్ని వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే అప్పటికే ఇల్లు మొత్తం అగ్నికి ఆహుతి అయింది.ఈ ఘటనపై స్పందించిన గ్రామ సర్పంచ్ కుందూరు. సత్యనారాయణ రెడ్డి, మండల వైసీపీ కన్వీనర్ మురారి వెంకటేశ్వర్లు విషయం తెలుసుకున్న వెంటనే మార్కాపురం నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జి అన్నా రాంబాబు గారి దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే బాధిత కుటుంబానికి సహాయం అందించాలని స్థానిక వైసీపీ నాయకులను ఆదేశించి శ్యామల కు 5000 రూపాయల నగదును ఆర్థిక తోర్పాటుగా నేను పంపిస్తున్నాను. వారికి నగదు సహాయాన్ని అందజేయండి అంటూ తెలపడంతో.వారి సూచనల మేరకు బాదిత కుటుంబానికి అందజేశారు. అదేవిధంగా గ్రామ నాయకులు ఆరికట్ల వెంకట నారాయణ రెడ్డి ఎక్స్ ఆర్మీ మరియు లైన్స్ క్లబ్ మెంబర్ బాధిత కుటుంబానికి తన వంతు సహాయంగా నిత్యావసర సరుకులు, 25 కేజీల బియ్యం ప్యాకెట్ ను అందజేశారు.అనంతరం వైసీపీ నాయకులు బాధిత కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పడంతో పాటు, ఈ నిరుపేద కుటుంబాన్ని ప్రభుత్వం తరఫున వెంటనే ఆదుకోవాలని కోరారు. ఇల్లు పూర్తిగా దగ్ధమైన నేపథ్యంలో ప్రభుత్వం నుంచి సహాయక ప్యాకేజీ, నివాసం కల్పించి పునరావాసం ఏర్పాటు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ పి. వెలుగొండయ్య, వైసీపీ నాయకులు, కోటపాటి ప్రసాద్ రెడ్డి, సామెల్, నాగేశ్వరరావు రాము లక్ష్మయ్య ఆరికట్ల వెంకటనారాయణ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
