
జనం న్యూస్. తర్లుపాడు మండలం. జనవరి 24
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు తర్లుపాడు మండలంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా రాజకీయాలకు అతీతంగా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, మండల జనసేన నాయకులు వెలుగు కాశిరావు ఒక గొప్ప సంకల్పాన్ని చాటుకున్నారు.విద్యార్థుల చదువు కోసం విరాళం తర్లుపాడు మండల కేంద్రంలోని ఎస్సీ హాస్టల్ లో పదో తరగతి చదువుతున్న విద్యార్థుల కోసం సుమారు 25 వేల రూపాయల విలువ చేసే స్టడీ చైర్లను వెలుగు కాశిరావు బహుకరించారు. పదో తరగతి పరీక్షలు దగ్గరపడుతున్న తరుణంలో, విద్యార్థులు కింద కూర్చుని ఇబ్బంది పడకుండా, సౌకర్యవంతంగాచదువుకోవాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.మంత్రి లోకేష్ ఆశయాలకు అనుగుణంగా ఈ కార్యక్రమం సందర్భంగా జనసేన మండల నాయకులు వెలుగుకాశిరావుమాట్లాడుతూరాష్ట్ర విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని తపిస్తున్న మంత్రి నారా లోకేష్ ఆశయాలకు అనుగుణంగా ఈ సేవా కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు.చదువే రేపటి తరాన్ని నిర్మిస్తుంది. నిరుపేద విద్యార్థులకు చిన్న సహాయం చేసినా, అది వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తుంది. నారా లోకేష్ పుట్టినరోజున ఇలాంటి అర్థవంతమైన కార్యక్రమం చేయడం సంతోషంగా ఉంది అని ఆయన ఆకాంక్షించారు.హర్షం వ్యక్తం చేసిన విద్యార్థులుహాస్టల్ విద్యార్థులు మరియు వార్డెన్ ఈ సందర్భంగా జనసేన నాయకుడు వెలుగు కాశీరావు కు కృతజ్ఞతలు తెలిపారు. సరైన వసతులు లేక ఇబ్బంది పడుతున్న సమయంలో ఈ కుర్చీలు తమకు ఎంతో ఉపయోగపడతాయని విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు వెన్నా రాజా రామ్ రెడ్డి, షేక్ ఖాసీం వలి, పఠాన్ ఫిరోజ్, షేక్ ఖైరు,షేక్ అఫ్రోజ్,కొండెబోయిన సునీల్,పఠాన్ కరీముల్లా, గడ్డం బాలరాజు, షేక్ బాషా, గుంటూ మోషే,చీకటి శివాకాసి కుర్ర నరేంద్ర,,వన్నెబోయిన వెంకటేశ్వర్లు,సయ్యద్ రఫీ, జనసేన వెంకట్,జాన్ బనియన్, గుంటూ ప్రేమ్ కుమార్, షేక్ మస్తాన్ గుంటూ భాస్కర్, పులుకూరి సాగర్, తదితరులు పాల్గొన్నారు