
జనం న్యూస్ జనవరి 24 జగిత్యాల జిల్లా
బీరుపూర్ మండలం మంగేళ సెక్షన్ పరిధిలోని రంగసాగర్ అడవి ప్రాంతం ప్రస్తుతం వన్యప్రాణుల అడుగు జాడలు అన్యేశణ వేదికైంది జిల్లా అటవీ అధికారి ఎం రవిప్రసాద్ అత్యంత నిశిత పర్యవేక్షణలో
ధర్మపురి అటవీ రేంజ్ వన్యప్రాణుల 20/1/2026 లెక్కింపు ప్రక్రియను ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా ప్రతి నాలుగు ఏళ్లకోసారి నిర్వహించే 'ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్-2026'లో భాగంగా అటవీశాఖ అధికారులు ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నెల 20న ప్రారంభమైన ఈ సర్వే 25వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ సందర్భంగా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనాథ్ మా ట్లాడుతూ.. వన్యప్రాణుల గణనను అత్యంత పారదర్శకంగా, శాస్త్రీయ పద్ధతిలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో అటవీ ప్రాంతాలను జల్లెడ పడుతున్నారని పేర్కొన్నారు.2 కిలోమీటర్ల మేర లైన్ సర్వే చేస్తూ సమాచారాన్ని సేకరిస్తున్నారు.జంతువుల ఉనికిని గుర్తించేందుకు 5 కిలోమీటర్ల మేర ఈ సర్వే నిర్వహిస్తున్నామని జంతువుల పాదముద్రలు, విసర్జితాలు, శరీర వెంట్రుకలు, చెట్లపై గోర్ల గీతలు,నేలపై పొర్లాడిన గుర్తులను సేకరిస్తున్నామని. ఇలా సేకరించిన వివరాలు జియో-ట్యాగింగ్ చేస్తూ, తక్షణమే కేంద్ర ప్రభుత్వం సూచించిన 'ఎం స్ట్రెప్స్ ఎకలాజికల్' మొబైల్ యాప్?లో నమోదు చేస్తున్నారు. ఈ గణన/సర్వే కార్యక్రమంలో అటవీశాఖ సెక్షన్ ఆఫీసర్ అర్ ప్రకాష గంగారం బీట్ ఆఫీసర్ నవీన్ కిరణ్, బాపూరావు బేస్ క్యాంప్ అటవీ సిబ్బంది పాల్గొన్నారు.
