
జనం న్యూస్ జనవరి 24, వికారాబాద్ జిల్లా
, పూడూరు మండలం చిట్టెంపల్లి గ్రామ పరిధిలోని పోతిరెడ్డి గూడలో భూభారతి భూసర్వే,రీసర్వే కార్యక్రమాలపై నిర్వహించిన అవగాహన సదస్సులో పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి స్థానిక నాయకులతో కలిసి హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి, మాట్లాడుతూ భూసర్వే, రీసర్వే ద్వారా రైతుల భూమి హక్కులకు పూర్తి భద్రత కలుగుతుందని, భూ సమస్యలు శాశ్వతంగా పరిష్కారమయ్యేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ ఆర్ డి ఓ వాసు చంద్ర, ఆత్మ కమిటీ చైర్మన్, శ్రీనివాస్ రెడ్డి, గ్రామ సర్పంచి, చంగోముల సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు.