
జనం న్యూస్ 24 జనవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
నైనీ కోల్ మైన్ లో జరిగిన అవినీతి అక్రమాలు వెలుగులోకి వచ్చాయి కాబట్టి రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ నడుపుతున్నాడు.కేటీఆర్ మీద హరీష్ రావు మీద అక్రమ కేసులు పెట్టి వెబ్ సిరీస్ లాగా విచారణ జరుపుతుంది ఈ ప్రభుత్వం .అవరమైతే బి ఆర్ ఎస్ పార్టీ తరుపున జైల్ భరో కార్యక్రమం నిర్వహిస్తాం..6 గ్యారెంటీలు 420 హామీలు అమలు చేయలేక ప్రజల దృష్టి మరల్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం మా నాయకులపై తప్పుడు కేసులు పెడుతుంది.మూసీ నది సుందరీకరణ పేరుతో 1 లక్ష 50 వేల కోట్ల దోపిడీని అడ్డుకున్నాడు కేటీఆర్ తన అల్లుడి ఫార్మా కంపెనీ కోసం లగచర్ల గిరిజన రైతుల భూములు బలవంతంగా లాక్కోవడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తే ఆ బాధితులకు అండగా ఉన్నాడు కేటీఆర్ హిల్ట్ పాలసీ పేరుతో 5 లక్షల కోట్ల దోపిడీని అడ్డుకున్నాడు కేటీఆర్ హెచ్ యు భూములపై 10 వేల కోట్ల దోపిడీకి రేవంత్ రెడ్డి పాల్పడితే అడ్డుకున్నది కేటీఆర్ ..రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కొరకురాని కొయ్యగా మారిండు కేటీఆర్ కాబట్టే కేటీఆర్ మీద హరీష్ రావు మీద అక్రమ కేసులు పెడుతున్నారు…పేరుకే 7 వ గ్యారెంటీగా ప్రజాస్వామ్యం అన్నారు కానీ అడుగడుగునా కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతూ పోలీసులు తుపాకులు పట్టుకుని కర్రలు పట్టుకుని యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తున్నారు..కేటీఆర్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న అవినీతి, దోపిడీ గురించి ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతుంది ఈ ప్రభుత్వం.
డా.కురువ విజయ్ కుమార్ బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు