జనం న్యూస్ ఫిబ్రవరి 07: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల కేంద్రంలోని నాగేంద్ర నగర్ గ్రామంలో దొంగల బీభత్సం జరిగింది. స్థానిక ఎస్సై బి.రాము తెలిపిన వివరాల ప్రకారం తేది 07-02-2025 ఆందజా మేకువ జామునసమయంలో గుర్తుతెలియని దొంగలు జంగం చిన్న ముత్తెన్న ఇంటి తాళం పగుల గొట్టి ఇంటిలోకి ప్రవేశించి పడక గదిలోఉన్న బీర్వాను పగల గొట్టి వారు దాసుకున్న పతనపు ఉంగరం, వారి చిన్న బాబు యొక్క రెండు వెండి కడియాలు మరియు 1000రూపాయలు దోచుకొని పోయారు. జంగం ముత్తేన్న ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సైబి.రాము తెలిపారు