
జనం న్యూస్ జనవరి 24 చిలిపిచెడు మండల ప్రతినిధి
మెదక్ జిల్లా చిలిపిచేడు మండలంలోని వివిధ గ్రామాలలో ఉన్నటువంటి అంగన్వాడి కేంద్రాలలో
ఉన్న అన్ని అంగన్వాడి కేంద్రాలలోజాతీయ బాలిక దినోత్సవం సందర్భంగాబేటి జన్మోత్సవం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. బేటి పడావో బేటి బచావో ( ఆడపిల్లల్ని రక్షిద్దాం మరియు ఆడపిల్లల్ని చదివిద్దాం) ప్రతి ఇంట్లో ఆడ మగ తేడా లేకుండా ఇద్దరిని సమానంగా చూడాలని చెప్పడం జరిగింది. బిడ్డ పుట్టిన వెంటనే జననాన్ని గ్రామపంచాయతీలో నమోదు చేయాలని, జనన ధ్రువీకరణ సర్టిఫికెట్ తీసుకోవాలని, మరియు 10 సంవత్సరాల లోపు ఆడపిల్లలందరికీ సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని వినియోగించుకోవాలని చెప్పడం జరిగింది. మరియు ఈ సి సి ఈ డే కార్యక్రమం నిర్వహించడం జరిగింది అలాగే షేర్ కుంట తండాలోహాజరైన ఆరు నెలల్లోపు ఆడపిల్లల పాదముద్రలు వేసి వారి తల్లిదండ్రులకి ఇవ్వడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి, గౌరవ సర్పంచ్లు, ఉప సర్పంచ్లు వార్డ్ మెంబర్స్, పంచాయతీ కార్యదర్శులు, ఆరోగ్య సిబ్బంది, పిల్లలు మరియు తల్లులు, అంగన్వాడీ టీచర్స్ మరియు హెల్పర్స్, ఐ సి డి ఎస్ సూపర్వైజర్ పాల్గొనడం జరిగింది.