
జనం న్యూస్ జనవరి 24 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం గంటి పెదపూడి గ్రామంలో స్కూల్ లో ఆడుకుంటున్న సమయంలో బొమ్మ పడి, రెండో తరగతి చదువుతున్న డి.జాహ్నవి పాప దుర్మరణం చెందడం అత్యంత హృదయవిదారకంగా మారింది.ఈ విషాద ఘటన నేపథ్యంలో జాహ్నవి పాప కుటుంబాన్ని కలిసి పరామర్శించిన పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ,డా. బీ.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా టీడీపీ అధ్యక్షులు గుత్తుల సాయి , వాసంశెట్టి సత్యం ,జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి శ్రీ గంధం పల్లం రాజు , నామన రాంబాబు , రాష్ట్ర హెచ్ ఆర్ డి సభ్యులు నేదునూరి వీర్రాజు తదితరులు.ఈ సందర్భంగా సత్యం ఫౌండేషన్ ద్వారా మృతి చెందిన జాహ్నవి పాప కుటుంబానికి రూ.1 లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందజేసి
వాసంశెట్టి సత్యం పాప కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు అనంతరం సంఘటన స్థలాన్ని పరిశీలించారు.
